మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో గత 40 సంవత్సరాలుగా ఒకే వినాయకుని ప్రతిష్టించి పూజించడం, గ్రామస్తులంతా ఐక్యంగా ఉండడం అభినందనీయమని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. శుక్రవారం రోజు అబ్దుల్లాపూర్ గ్రామంలో ప్రతిష్టించిన మోక్ష కర్ర వినాయకుడిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులు, మహిళలు కలిసికట్టుగా ఉండి గ్రామాభివృద్ధికి పాటుపడటం ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా స్థానికులతో తన సెల్ఫోన్లో సెల్ఫీ తీసుకున్నారు. జిల్లా ఎస్పీ గ్రామంలోకి రావడంతో స్థానిక సర్పంచ్ జయలలిత భోజన్న పూలగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. గ్రామస్తులు, ఎస్పీ మేడమ్ ను భాజా భజంత్రీలతో గ్రామ ప్రారంభం నుండి గణేశుని మండపం వరకు వందల మంది మహిళలతో స్వాగతం పలుకుతూ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ జయలలిత భోజన్న, ఏఎస్పి సాయికిరణ్, సిఐ రవీంద్రనాయక్, ఎస్ఐ ప్రదీప్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామస్తుల ఐక్యత అభినందనీయం ఎస్పీ జానకి షర్మిల
Share:

సారాంశం
మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో గత 40 సంవత్సరాలుగా ఒకే వినాయకుని ప్రతిష్టించి పూజించడం, గ్రామస్తులంతా ఐక్యంగా ఉండడం అభినందనీయమని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. శుక్రవారం రోజు అబ్దుల్లాపూర్ గ్రామంలో ప్రతిష్టించిన మోక్ష కర్ర వినాయకుడిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముఖ్య విషయాలు
- మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో గత 40 సంవత్సరాలుగా ఒకే వినాయకుని ప్రతిష్టించి పూజించడం, గ్రామస్తులంతా ఐక్యంగా ఉండడం అభినందనీయమని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు.
- శుక్రవారం రోజు అబ్దుల్లాపూర్ గ్రామంలో ప్రతిష్టించిన మోక్ష కర్ర వినాయకుడిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- గ్రామస్తులు, మహిళలు కలిసికట్టుగా ఉండి గ్రామాభివృద్ధికి పాటుపడటం ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు.
- జిల్లా ఎస్పీ గ్రామంలోకి రావడంతో స్థానిక సర్పంచ్ జయలలిత భోజన్న పూలగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3729ఆర్టికల్స్
4,59,478వ్యూస్








