బైంసా పట్టణంలోని కిసాన్గల్లీలో మహారాణా ప్రతాప్ యూత్ ఆధ్వర్యంలో హారతి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనిల్‌కుమార్ జాదవ్, డాక్టర్ ముత్యం రెడ్డి, కిసాన్‌గల్లి సర్పంచ్ దిపోల సాయినాథ్ పాల్గొని హారతి సమర్పించారు.
యూత్ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో మహారాణా ప్రతాప్ యూత్ సభ్యులతో పాటు కిసాన్‌గల్లీకి చెందిన పలువురు పాల్గొన్నారు.












