లోకేశ్వరం, 14 September
లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో మోక్ష కర్ర వినాయకుడిని సోమవారం గ్రామస్తులందరూ కలిసి భక్తిశ్రద్ధలతో, భాజాభజంత్రీల నడుమ ప్రతిష్ఠించారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ప్రత్యేక కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు.
*అబ్దుల్లాపూర్ లో కొలువుదీరిన మోక్ష ( కర్ర )వినాయకుడు* లోకేశ్వరం... మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో మోక్ష కర్ర వినాయకుని సోమవారం రోజు గ్రామస్తులు అందరూ కలిసి భక్తిశ్రద్ధలతో భాజా భజంత్రీలతో ప్రతిష్టింపజేశారు ఈ ఉత్సవాలను గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఈ ఉత్సవాలకు జిల్లాతో పాటు పొరుగు జిల్లాలైన అదే విధంగా మహారాష్ట్ర నుండి సైతం భక్తులు అధిక సంఖ్యలో రానున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ గ్రామంలో గత 40 సంవత్సరాలుగా గ్రామంలో ఒకే గణ వినాయకుని ప్రతిష్టించి పూజలు చేసేవారు గత మూడు సంవత్సరాల నుండి ప్రత్యేకంగా కర్రతో తయారు చేయించిన వినాయకుని ప్రతిష్టిస్తున్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా గ్రామస్తులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వారి పేర్కొన్నారు












