Bhimgal, 28 October
వరంగల్ పట్టణంలో 3 రోజుల పాటు అత్యంత వైభవంగా సంత్ నిరంకారీ 79వ వార్షిక ఆధ్యాత్మిక మహాసభలు నిర్వహించారు. ఈ మహాసభలకు భీంగల్ పట్టణానికి చెందిన నిరంకారీ భక్తులు ఎన్.జి. సాయన్న, మందం భూమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక మేల్కొలుపు ప్రధాన ఉద్దేశ్యంగా ఈ సభలు జరిగాయి.
వరంగల్ పట్టణంలో 3 రోజుల పాటు అత్యంత వైభవంగా సంత్ నిరంకారీ 79వ వార్షిక ఆధ్యాత్మిక మహాసభలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక మహాసభలకు భీంగల్ పట్టణానికి చెందిన నిరంకారీ భక్తులు ఎన్.జి. సాయన్న, మందం భూమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక మేల్కొలుపు అనే ముఖ్య ఉద్దేశ్యంతో ఈ మహాసభలను నిర్వహించారు. కేవలం సత్సంగాలకే పరిమితం కాకుండా, ప్రతిక్షణం భగవంతుని స్మరిస్తూ ప్రేమ, కరుణ, వినమ్రతలతో జీవించడమే నిజమైన మేల్కొలుపు అని సాయన్న, భూమేశ్వర్ తెలిపారు. వేలాదిమంది నిరంకారీ సేవకులు క్రమశిక్షణ, సేవా తత్పరతను చాటుతూ నిర్వహించిన భారీ సేవాదళ్ ర్యాలీ ఈ సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశ విదేశాల నుండి లక్షలాదిమంది భక్తులు తరలివచ్చి గురువందన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు. నిరంకారీ భక్తులు సాయన్న, భూమేశ్వర్ మాట్లాడుతూ, ఈ ఆధ్యాత్మిక మహాసభలలో పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు.












