కీసర, 24 September
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మండలం, దమ్మైగూడ డివిజన్, బండ్లగూడ ప్రాంతంలోని వీఆర్ఆర్ హోమ్స్ ఫేజ్-1 బృందావన కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏడో వార్షికోత్సవ వేడుకలు జరిగాయి.
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మండలం, దమ్మైగూడ డివిజన్, బండ్లగూడ ప్రాంతంలోని వీఆర్ఆర్ హోమ్స్ ఫేజ్-1 బృందావన కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏడో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించినట్లు సీఐటీయూ మండల కన్వీనర్ బంగారు నర్సింగరావు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన గణేశుడి లడ్డూ వేలం పాటలో గతేడాది కంటే అధికంగా రూ.2,25,116 రికార్డు ధర పలికింది. కొలవెన్ను చంద్రశేఖర్, కొలవెన్ను దర్శిని దంపతులు ఈ లడ్డూను వేలంలో దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు, వీఆర్ఆర్ హోమ్స్ ఫేజ్-1 బృందావన కాలనీ అసోసియేషన్ సభ్యులు దంపతులకు అభినందనలు తెలిపారు. వినాయకుడి ఆశీస్సులు కొలవెన్ను కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన కాలనీ వాసులకు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.












