మంచిర్యాల జిల్లా, జన్మభూమి నగర్‌లోని సృష్టి ఎంక్లేవ్ అపార్ట్మెంట్లో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణనాథుడికి ఘనంగా పూజలు నిర్వహించారు. మహిళలు ముగ్గులు వేసి, భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సందర్భంగా గణనాథుడికి 108 రకాల స్వీట్లు, 108 రకాల ప్రసాదాలతో నైవేద్యం సమర్పించారు. అపార్ట్మెంట్ వాసులు భక్తిశ్రద్ధలతో పాల్గొని, వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
కార్యక్రమంలో పేరం రాజయ్యజోత్స్న దంపతులు, న్యాయవాది అలేఖ్య నటేశ్వర్, ఎథిక్ అకాడమీ యాజమాన్యం, పల్లవి మోడల్ స్కూల్ యాజమాన్యం, శ్రీనివాస్, సత్యనారాయణ రెడ్డి, సతీష్ రావు, చౌదరి, రాజగోపాల్‌తో పాటు కాలనీవాసులు, మహిళలు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.












