బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 08
మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా, టెస్టింగ్ పేరుతో అధిక శబ్దం వచ్చేలా డీజే ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించిన డీజే యజమాని ఇర్షాద్ అలీపై పోలీసులు కేసు నమోదు చేశారు. డీజేతో పాటు వాహనాన్ని సీజ్ చేశారు.
టెస్టింగ్ పేరుతో అధిక శబ్దం డీజే యజమాని ఇర్షాద్ అలీ పై కేసు నమోదు :డీజేతో పాటు వాహనం సీజ్ ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా టెస్టింగ్ పేరుతో అధిక శబ్దం వచ్చేలా డీజే ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించిన డీజే యజమాని ఇర్షాద్ అలీపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, డీజేతో పాటు వాహనాన్ని సీజ్ చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా, నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దంతో డీజేలు, సౌండ్ సిస్టమ్స్ వినియోగించడం వల్ల శబ్ద కాలుష్యంతో పాటు ప్రజా ప్రశాంతతకు భంగం కలుగుతుందని పేర్కొన్నారు. వృద్ధులకు పిల్లలకు గర్భిణీలకు ఆసుపత్రిలో చికిత్స పొందే వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు.సుప్రీంకోర్టు ఉత్తర్వులు మరియు శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, టెస్టింగ్ పేరుతోనైనా అధిక శబ్దంతో డీజేలు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీఐ గురుస్వామి, ఎస్ఐ పురుషోత్తం సిబ్బంది పాల్గొన్నారు.












