నిర్మల్, 2026-11-06
నిర్మల్ జిల్లా సారంగాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రెండు దొంగతనాలను పోలీసులు ఛేదించి, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, దొంగిలించిన సొత్తుతో పాటు ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు.
సారంగాపూర్ పాత బస్టాండ్ ప్రాంతంలో కందూరి రాజమణి ఇంటి తాళం పగలగొట్టి, ఇంట్లో ఉన్న ఇత్తడి, వెండి వస్తువులను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. అదే రోజు రాత్రి జాం గ్రామంలో మనుకల రాజేశ్వర్ కు చెందిన ప్యాషన్ ప్రో బైక్ను కూడా దొంగిలించారు. ఈ క్రమంలో పోలీసులు నిందితులు 1 సుగేందర్ (వైఎస్ఆర్ కాలనీ, నిర్మల్), 2 గబ్బర్ సింగ్ రాథోడ్ (ఆదిలాబాద్)లను ఈ రోజు అరెస్ట్ చేశారు.
కేసు నంబర్ 144/2026, సెక్షన్ 331(4), 305 కింద సుమారు రూ.20,000 విలువైన ఇత్తడి వస్తువులు, వెండి మొలతాడు, వెండి కుంకుమ భరణి స్వాధీనం చేసుకున్నారు. అలాగే, కేసు నంబర్ 145/2026, సెక్షన్ 305 కింద రూ.55,000 విలువైన ప్యాషన్ ప్రో బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల ఛేదనలో ప్రతిభ కనబరిచిన హెడ్ కానిస్టేబుల్ జమీర్, కానిస్టేబుళ్లు మాధవ్, రవిలను నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, జిల్లా ఎస్పీ డా. జానకీ షర్మిల ఐపీఎస్ అభినందించారు.






