బాసర రైల్వే స్టేషన్ ప్రవేశ ద్వారం వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సుమారు 50 ఏళ్ల వయస్సున్న వ్యక్తి మృతదేహాన్ని మంగళవారం ఉదయం గుర్తించారు. నిజామాబాద్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాసర రైల్వే స్టేషన్ ప్రవేశ ద్వారం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మంగళవారం ఉదయం 8.10 గంటలకు సుమారు 50 ఏళ్ల వయస్సున్న వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు స్టేషన్ నిర్వాహకుడు ఎ. రవీందర్ నిజామాబాద్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడు అనారోగ్య కారణాలతో సహజంగా మృతి చెంది ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతుడిని గుర్తించేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడి వివరాలు తెలిసినవారు నిజామాబాద్ రైల్వే పోలీసు ఉపపరిశీలకుడు హెచ్. సాయిరెడ్డిని 8712658591 నంబరులో సంప్రదించాలని పోలీసులు కోరారు.











