నిర్మల్ జిల్లా బాసర గోదావరి తీరాన ఉన్న ప్రసిద్ధ ఆశ్రమానికి చెందిన కోట్ల విలువైన భూముల రిజిస్ట్రేషన్లలో భారీ కుంభకోణం జరిగినట్లు అధికారిక పత్రాల పరిశీలనలో బయటపడింది. 1986 నుండి ఆశ్రమం పేరు మీద ఉన్న భూమి, 2008 లో రక్షణ ఆర్డర్ ఉన్న ఆస్తి, 2013 లో తప్పుడు ఇంటి నంబర్‌తో 10 డాక్యుమెంట్లుగా రిజిస్టర్ అయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో కొందరు ప్రముఖుల ప్రమేయం ఉండవచ్చని భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
1986 - మూలం - ఆశ్రమం పేరు మీద భూమి
ఈ మొత్తం వ్యవహారానికి మూలం రిజిస్టర్ సేల్ డీడ్ నంబర్ 333/1986. ఈ పత్రం ప్రకారం - కొనుగోలుదారు: శ్రీ దశరథ్ మహారాజ్, తండ్రి: లక్ష్మీ ప్రియ దాస్, వయసు 40, వృత్తి - ఆశ్రమ నిర్వహణ, నివాసం - బాసర. అమ్మిన వ్యక్తి: బక్కన్న, తండ్రి: చిన్నన్న, బాసర. కొన్న భూమి: సర్వే నంబర్ 309 లో 8 ఎకరాల 5 గుంటలు (2.40 హెక్టార్లు). హద్దులు: తూర్పున గోదావరి నది రోడ్డు, పడమర సెల్లర్ భూమి, ఉత్తరాన మేటాదేవి భూమి, దక్షిణాన ఇదే సర్వే నంబర్లో మిగిలిన భూమి. అంటే 40 ఏళ్ల క్రితమే మహారాజ్ గారు ఆశ్రమ నిర్వాహకుడిగా ఈ భూమిని కొనుగోలు చేసినట్లు ప్రభుత్వ రికార్డుల్లో స్పష్టంగా ఉంది. ఈ ఆస్తి ఆశ్రమం వ్యక్తిగత ఆస్తి కాదు.
2008 - సీలు, రక్షణ ఆర్డర్ - ప్రభుత్వ రక్షణలోకి
దశరథ్ మహారాజ్ 19-06-2008 న ప్రమాదవశాత్తు మరణించారు. ఆశ్రమ వారసులు, శిష్యులు, భక్తులు మరియు మహారాజుకు సంబంధించిన వారమని చెప్పుకుంటున్న బంధువులకు మధ్య వివాదం తలెత్తింది. శాంతి భద్రతల సమస్య వస్తుందని ముధోల్ నివేదిక ఇవ్వడంతో, నిర్మల్ (నంబర్ /1331/2008, తేదీ 28-08-2008) ముధోల్, బాసర లకు ఆశ్రమానికి రక్షణ కల్పించడానికి తదుపరి చర్యలు చేపట్టండి అని ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందే 19-06-2008, 20-06-2008 తేదీల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శి, , సమక్షంలో పంచనామా చేసి, ఇంటి నంబర్ 4-83 గా గుర్తించి సీలు వేశారు. ఆ తర్వాత అదే ఇల్లు పంచాయతీ రికార్డుల్లో 4-71 (4-53), ఆపై 4-258 గా నమోదైంది. 05-09-2008 నాడు గ్రామ పంచాయతీ బాసర కూడా నోటీసు జారీ చేసింది.
2013 - వివాదాస్పద 10 రిజిస్ట్రేషన్లు
ప్రభుత్వ రక్షణలో, కోర్టు వివాదంలో ఉన్న అదే ఆస్తిని 2013/2014 నుండి 2013/2033 వరకు 10 సేల్ డీడ్లుగా రిజిస్ట్రేషన్ చేసినట్లు పరిశీలనలో తేలింది.
1. పాస్‌బుక్, టైటిల్ డీడ్ జిరాక్స్ కాపీలు లేవు - ఒరిజినల్ పాస్‌బుక్ నంబర్ 253, టైటిల్ డీడ్ నంబర్ 210891 బాధితుల వద్దనే ఉన్నాయి. కానీ 10 డాక్యుమెంట్లలో వాటి జిరాక్స్ కాపీలు కూడా జత చేయలేదు. కేవలం నంబర్లు మాత్రమే రాశారు. 2. నంబర్లు రాస్తే సరిపోదు - తెలంగాణ నిబంధనల ప్రకారం సబ్-రిజిస్ట్రార్ ఒరిజినల్ పాస్‌బుక్ చూడాలి, జిరాక్స్ కాపీని డాక్యుమెంట్‌కు జత చేయాలి. .147 ప్రకారం ఇది తప్పనిసరి నిబంధన. 3. హౌస్ టాక్స్ రసీదు లేదు - ఇంటి రిజిస్ట్రేషన్‌కు తప్పనిసరి అయిన గ్రామ పంచాయతీ హౌస్ టాక్స్ రసీదు ఏ ఒక్క డాక్యుమెంట్లోనూ లేదు. 4. తప్పుడు ఇంటి నంబర్ 4-21 తో మోసం - ఇదే కీలకం. సీలు వేసిన ఇల్లు 4-83, పంచాయతీ రికార్డుల్లో 4-71 (4-53), 4-258 కాగా, రిజిస్ట్రేషన్‌లో 4-21 గా చూపించారు. ఈ 4-21 నంబర్‌ను గ్రామ పంచాయతీ దశరథ్ మహారాజ్ పేరు మీద ఎప్పుడూ కేటాయించలేదు, అసెస్మెంట్ రిజిస్టర్లోనూ లేదు. సర్వే నంబర్ 309, హద్దులు, నక్షా మాత్రం సీలు వేసిన ఆస్తివే వాడి, పైన తప్పుడు నంబర్ వేశారు. ఇది నక్షాతో మోసం. 5. నిషేధిత జాబితా భూమి కూడా రిజిస్ట్రేషన్ - కోర్టు ఆదేశాల మేరకు నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నంబర్ 309 లోని 3.29 ఎకరాల భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేశారు. 6. లింక్ డాక్యుమెంట్లు లేవు - 1986 మూల డాక్యుమెంట్ నంబర్ 333/1986 లింక్ కాపీ కూడా జత చేయలేదు.












