ఆర్ఎస్ఎస్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 08
భైంసా పట్టణంలోని పద్మావతి కాలనీలో హిందూ ఉత్సవ సమితి నూతన కార్యాలయాన్ని ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో , వీహెచ్పీ, మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
భైంసాలో హిందూ ఉత్సవ సమితి కార్యాలయం ప్రారంభం భైంసా పట్టణంలోని పద్మావతి కాలనీలో హిందూ ఉత్సవ సమితి నూతన కార్యాలయాన్ని ఆదివారం ఘనంగా ప్రారంభించారు. జిల్లా సహ సంఘ చాలక్ సాదుల కృష్ణదాస్, కుటుంబ ప్రభుదక్ సరికొండ దామోదర్, వీహెచ్పీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేష్, మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, బబ్రు మహారాజ్, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఏనుపోతుల మల్లేష్ తదితరులు కలిసి కార్యాలయాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సమితి కార్యకలాపాలు, భవిష్యత్లో నిర్వహించనున్న హిందూ పండుగలు, ఉత్సవాలకు సంబంధించిన కార్యక్రమాలపై చర్చించారు.కార్యక్రమంలో ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్రావు పటేల్, పలువురు కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, హిందూ ఉత్సవ సమితి కమిటీ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.












