నిజామాబాద్, 7 September
మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ () జాతీయ కోర్ కమిటీ సభ్యులుగా తెడ్డు గంగారాం మాదిగ నియమితులయ్యారు. ఈ నియామకం పట్ల ఆయన వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాకు చెందిన గంగారాం మాదిగ, లో వివిధ కీలక పదవులను నిర్వహించారు.
*మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (MEF) జాతీయ కోర్ కమిటీ సభ్యులుగా నన్ను నియమించిన చేసిన MRPS వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు..* 1994 లో MRPS ఉద్యమం మంద కృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మొదలైంది. ఈ ఉద్యమం గురించి పేపర్లలో చూడడం తప్ప అన్న గారిని భౌతికంగా కలవడానికి అవకాశం రాలేదు. కానీ 2000 సంవత్సరంలో అన్న గారిని ప్రత్యక్షంగా కలిసి MRPS ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. 2002 లో మంద కృష్ణ మాదిగ గారు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగస్తుల ప్రమోషన్లలో రిజర్వేషన్లలు కోసం పోరాడుతున్న సమయంలో నన్ను జిల్లా ఎస్సీ, ఎస్టీ ప్రమోషన్ల రిజర్వేషన్ల సాధన సమితి కో ఇంచార్జిగా జిల్లాకు నియించడం జరిగింది. ఆ తర్వాత 2010 లో MEF ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా, MRPS పొలిట్ బ్యూరో సభ్యునిగా, MEF రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, అలాగే MEF జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఇప్పుడు MEF జాతీయ కోర్ కమిటీ సభ్యులుగా నియమించడం జరిగింది. ఇలాంటి అత్యున్నత పదవులలో పని చేయడానికి నాకు ఇప్పటి వరకు శక్తిని ఇచ్చి సహకారాన్ని అందించిన MEF జాతీయ, రాష్ట్ర, జిల్లా కమిటీ నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నాకు సహకరించి జిల్లా MRPS, MSP, MEF, MMS, MSF నాయకత్వానికి కూడ హృదయపూర్వక కృతజ్ఞతలు.. మీ తెడ్డు గంగారాం మాదిగ MEF జాతీయ కోర్ కమిటీ సభ్యులు






