నిర్మల్ జిల్లా మండలంలోని కోలుర్ గ్రామానికి చెందిన గుంజాల్వార్ గంగబాయి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ముధోల్ మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులైన భూమన్న, నారాయణ, లింగన్నలను కలిసి గంగబాయి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సాగర బాయి రాజన్న, మాజీ జడ్పీటీసీ ఉత్తం బాలేరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి భీమ్ పవార్, భైంసా మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మౌలాఖాన్, మాజీ ఎంపీటీసీ పోశెట్టి, మాజీ సర్పంచ్ బాలాజీ, తాజా మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సురేష్ పటేల్, మొగిలి సర్పంచ్ ఉష దర్శన్, పాషా, భూమన్న, మాజీ సర్పంచ్ శంకర్, మనజీ, రాజు, సలీం, మొగలి షాధుల్, వార్డు సభ్యుడు సుధాకర్, ధర్మేందర్, బషీర్, బి. లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.












