ప్రొద్దుటూరు పాత అమృతనగర్ గ్రామంలో లాటూరు నాగరాజు అనే వృద్ధుడు అనారోగ్యంతో మరణించారు. అంత్యక్రియలు చేయడానికి బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో, మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్ ను ఫోన్ ద్వారా సంప్రదించగా, వారు వెంటనే స్పందించి, ఈరోజు హిందూ స్మశాన వాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ గొప్ప కార్యక్రమానికి చేయూత అందించిన ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, టౌన్ ప్రెసిడెంట్ సుబాహన్, ట్రెజరర్ భార్గవ్ సాయి, సతీష్, కిరణ్ కుమార్, అంజన్, పవన్ అంత్యక్రియలను పూర్తి చేశారు. చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు మాట్లాడుతూ, సమాజంలో ఎవరూ లేని వారికి కూడా గౌరవప్రదమైన అంత్యక్రియలు జరగాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ నిరంతరం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతూ, అవసరంలో ఉన్నవారికి అండగా నిలుస్తుందని ఫౌండేషన్ సభ్యులు పేర్కొన్నారు. మా శ్రీ అమ్మ శరణాలయంలోని వృద్ధులకు సహాయం చేయదలచిన దాతలు ఈ నంబర్లను సంప్రదించవలసిందిగా కోరుచున్నాము: 82972 53484, 9182244150.











