భైంసా పట్టణంలో నివాసముంటున్న కోతులగాం గ్రామానికి చెందిన ఏనుగు గంగారెడ్డి ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ముధోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకురాలు డా. పడకంటి రమాదేవి వారి కుటుంబాన్ని శుక్రవారం పరామర్శించారు.
బాధిత కుటుంబ సభ్యులను కలిసి తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఆమె, ఈ కష్టసమయంలో కుటుంబానికి ధైర్యం చెప్పారు. అనంతరం మృతుడు గంగారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సంపత్ పాటిల్, అక్షయ్ పాటిల్, విష్ణు రెడ్డి, గంగా భూషణ్, నందు భాయ్, సంతోష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.











