తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, వీర వనిత చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం ఐలమ్మ విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు.
ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగాలి
ఈ సందర్భంగా మిర్యాలగూడ బీసీ జేఏసీ పట్టణ కన్వీనర్ బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ మాట్లాడుతూ, ఐలమ్మ ఆశయ సాధన కొరకు ఆమె పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని నడుంబిగించి పాటుపడాలని కోరారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ జిల్లా ఉపాధ్యక్షులు యర్రబెల్లి దుర్గయ్య రజక, బీసీ యువజన జిల్లా కార్యదర్శి కుమ్మరికుంట్ల సుధాకర్ రజక, బీసీ మహిళా జిల్లా కార్యదర్శి బంటు కవిత, సామాజికవేత్త, ఉద్యమకారుడు యం డీ మహమ్మద్ కొత్తగూడెం, బీసీ విద్యార్థి పట్టణ కార్యదర్శి నక్క నాగరాజ్ ముదిరాజ్, బీసీ యువజన నాయకులు తాడూరి సైదులు రజక, తుపాకుల తుకారం రజక, భీమరాజ్, యర్రబెల్లి వెంకన్న రజక తదితరులు పాల్గొన్నారు.










