
లోకేశ్వరం నారాయణ స్కూల్ యాజమాన్యం తమ పూర్వ విద్యార్థిని మెండెసాయి చైతన్యను ఘనంగా సన్మానించింది. ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో ఆమె ఎంబీబీఎస్ సీటు సాధించింది.

లోకేశ్వరం నారాయణ స్కూల్ యాజమాన్యం తమ పూర్వ విద్యార్థిని మెండెసాయి చైతన్యను ఘనంగా సన్మానించింది. ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో ఆమె ఎంబీబీఎస్ సీటు సాధించింది.

ఆర్మూర్ ఇస్కాన్ ఆధ్వర్యంలో జరిగిన శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన భగవద్గీత శ్లోక పఠన పోటీల్లో చేపూరు క్షత్రియ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో 11 మంది విద్యార్థులు విజేతలుగా నిలిచారు.

ఉపాధ్యాయ దినోత్సవంలో పురస్కరించిన వార్డెన్ రాంజీగారు. ఈ సందర్భంగా విద్యార్థులు రాంజీగారి పాదాలను కడిగి, తమ అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో ఈ ర్యాలీ జరిగింది.

విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకులుగా నిలిచే ఉపాధ్యాయుల సేవలు అభినందనీయమని వక్తలు పేర్కొన్నారు. విశ్వ హిందూ పరిషత్ స్థాపన దినోత్సవం, ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా విశ్వ హిందూ పరిషత్ సారంగాపూర్ ప్రఖండం ఆధ్వర్యంలో, పాఠశాల, కళాశాలల ద్వారా ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన ప్రిన్సిపాల్‌ను ఘనంగా సన్మానించారు.

బైంసా పట్టణంలోని గణేష్‌నగర్‌లో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షులు తోట రాము ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద శనివారం జరగనున్న మహాదీక్ష కార్యక్రమంలో పాల్గొనేందుకు మండల బీజేపీ శ్రేణులు బయలుదేరారు. మండలంలోని పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కార్యకర్తలు ఉత్సాహంగా హైదరాబాద్‌కు పయనమయ్యారు.

తనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనిని కార్యకర్తలు ఎవరూ విశ్వసించవద్దని షాద్‌నగర్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. తనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావుకు అందె బాబయ్య ఫిర్యాదు చేసినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన తెలిపారు.

మండలంలోని వడ్తల గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. గ్రామ సర్పంచ్ రమేష్ లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతుల ఆవేదనను ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, రచయిత్రి మంజుల పత్తిపాటి తన రచన ద్వారా ఆవిష్కరించారు. నీవు వస్తావని ఆశ మామ అనే పేరుతో ఆమె రాసిన రచనలో రైతు కుటుంబాల పరిస్థితిని హృద్యంగా వివరించారు.

ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న ఎల్‌నినో రానున్న రోజుల్లో మరింత ఉధృతమవుతుందని, వచ్చే ఏడాది కూడా కొనసాగుతుందని ఐక్యరాజ్యసమితి అనుబంధ ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యుఎంఒ) హెచ్చరించింది. ఎల్‌నినో ప్రభావంతో అనూహ్య, అసాధారణ వర్షాలు, వరదలు, కరువు కాటకాలు, ఉష్ణోగ్రతలు సంభవిస్తాయని, ప్రభుత్వాల సన్నద్ధత, స్పందన సైతం అసాధారణంగా ఉండాలని సూచించింది. అయితే, ఆంధ్రప్రదేశ్ సన్నద్ధత, స్పందన సరిగ్గా లేదని ముందస్తు ఏర్పాట్లను, ప్రణాళికలను చూస్తే అర్థమవుతుంది.

బజార్ మండల కేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్, ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ విఫలమయ్యారని, వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని తెలిపారు.

బజార్ మండల కేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్, ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ విఫలమయ్యారని, వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని తెలిపారు.

హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనుల పురోగతిని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి , రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణ పనుల పురోగతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. వికారాబాద్ జిల్లా మండలం హకీంపేట్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి.. ఎడ్యుకేషన్ హబ్‌లో నిర్మాణంలో ఉన్న వివిధ విద్యా సంస్థల భవన సముదాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎడ్యుకేషన్ హబ్‌లో భాగంగా నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల, వెటర్నరీ, నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు 400 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను సీఎం పరిశీలించారు. అలాగే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనాలు, హాస్టళ్ల నిర్మాణాల పురోగతిని కూడా సమీక్షించారు. నిర్మాణ పనులన్నింటిలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. భవన నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు, సాంకేతిక అంశాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో ఎడ్యుకేషన్ హబ్ ప్రాంగణంలో నీరు నిల్వ ఉండకుండా వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భవిష్యత్తులో ల్యాండ్‌స్కేపింగ్ పనులకు వినియోగించేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులకు తెలిపారు. అనంతరం నియోజకవర్గంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా, ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలో సమరభేరి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహబూబాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

మండలం కనుముకుల గ్రామంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ కోట మల్లారెడ్డి అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, జిల్లా ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షుడు ఎలిమినేటి సందీప్ రెడ్డి మల్లారెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించారు.

రిటైర్డ్ ఏఎస్సై గుండెపోటుతో మృతి

ఎల్ నినో ప్రభావంతో రుతుపవనాలు బలహీనపడటం, సెప్టెంబర్‌లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం

గంగస్తాన్ ఫేస్ వన్ కు చెందిన ఏఎస్ఐ గంగాధర్ గౌడ్, పోలీసు శాఖ నుంచి పదవీ విరమణ చేసిన కేవలం నాలుగు రోజులకే గుండెపోటుతో మరణించారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, స్నేహితులు, తోటి ఉద్యోగులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.

దేశంలో మొట్టమొదటిసారిగా జరగనున్న కులగణనపై బీసీ సామాజిక వర్గాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. 96 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ గణనను సక్రమంగా నిర్వహించి, తమ సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అయితే, కేంద్రం అమలు చేస్తున్న విధానాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.