తెలంగాణ రాష్ట్రంలో సమ్మె చేస్తున్న రైస్ మిల్లర్లు సమ్మె విరమిస్తూ శనివారం రాష్ట్ర రైస్ మిల్లర్స్ ప్రతినిధుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్ లు తెలిపారు. రైస్ మిల్లుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పిలుపుమేరకు ఈనెల 11 నుంచి చేపట్టిన సమ్మె శనివారం రాత్రి నుంచి ముగిసింది. దీంతో రైస్ మిల్లు యధావిధిగా పనిచేయడం ప్రారంభించారు. ఈ విషయంపై మిల్లర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, మిర్యాలగూడ మిల్లర్స్ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్ లు మాట్లాడుతూ రైస్ మిల్లర్స్ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, మిల్లర్ల సమస్యలు పరిష్కరిస్తామని, ఇబ్బందులను తొలగిస్తామని పేర్కొన్నారని దీంతో సమ్మె విరమించామని, ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూఈనెల 20 నుంచి రైస్ మిల్లర్లు యధావిధిగా ధాన్యం కొనుగోలు, అమ్మకాలు వెంటనే చేపడతారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎగుమతి చేయవలసిన బియ్యం యధావిధిగా ఆదివారం నుంచి ఎగుమతులు ప్రారంభిస్తామని తెలిపారు. సిఎంఆర్ బియ్యం ఎగుమతులు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా మిర్యాలగూడ పట్టణంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో మిర్యాలగూడ పట్టణ, పరిసర ప్రాంతాల రైస్ మిల్లర్ల ప్రత్యేక సమావేశం ఈనెల 20 (ఆదివారం) ఉదయం 10:30 గంటలకు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది.
రైస్ మిల్లర్ల సమ్మె విరమణ నేటి నుంచి యధావిధిగా కొనుగోలు అమ్మకాలు
Share:

సారాంశం
రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, మిర్యాలగూడ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్
ముఖ్య విషయాలు
- ఈ సందర్భంగా వారు మాట్లాడుతూఈనెల 20 నుంచి రైస్ మిల్లర్లు యధావిధిగా ధాన్యం కొనుగోలు, అమ్మకాలు వెంటనే చేపడతారని తెలిపారు.
- రైస్ మిల్లుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పిలుపుమేరకు ఈనెల 11 నుంచి చేపట్టిన సమ్మె శనివారం రాత్రి నుంచి ముగిసింది.
- తెలంగాణ రాష్ట్రంలో సమ్మె చేస్తున్న రైస్ మిల్లర్లు సమ్మె విరమిస్తూ శనివారం రాష్ట్ర రైస్ మిల్లర్స్ ప్రతినిధుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్ లు తెలిపారు.
- దీంతో రైస్ మిల్లు యధావిధిగా పనిచేయడం ప్రారంభించారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3780ఆర్టికల్స్
4,64,643వ్యూస్










