నిర్మల్ పట్టణంలో అత్యాధునిక వసతులతో నూతనంగా ఏర్పాటు చేసిన చెన్నై షాపింగ్ మాల్ బుధవారం ఉదయం ఘనంగా ప్రారంభం కానుంది. ఈ ప్రారంభోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరుతూ మాల్ యాజమాన్యం మంగళవారం ప్రముఖులను, న్యాయ నిపుణులను కలిసి ఆహ్వానిస్తోంది.
నిర్మల్ పట్టణ ప్రజల ఎన్నో రోజుల నిరీక్షణకు తెరపడింది. పట్టణంలో అత్యాధునిక వసతులతో నూతనంగా ఏర్పాటు చేసిన చెన్నై షాపింగ్ మాల్ వ తేదీ బుధవారం ఉదయం ఘనంగా ప్రారంభం కానుంది.
ఈ ప్రారంభోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరుతూ చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం మంగళవారం ప్రముఖులు, న్యాయ నిపుణులను కలిసి ఆహ్వానిస్తున్నారు.
ఇందులో భాగంగా ప్రముఖ సీనియర్ న్యాయవాది, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కల్వకుంట్ల వినోద్ రావు ని ఆయన నివాసంలో యాజమాన్య ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. మాల్ ప్రారంభోత్సవానికి విచ్చేయాలని కోరారు.
ఈ సందర్భంగా వినోద్ రావు కి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. నిర్మల్ వంటి అభివృద్ధి చెందుతున్న పట్టణంలో ఇలాంటి పెద్ద షాపింగ్ మాల్ రావడం సంతోషకరమని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాల్ ప్రతినిధులు పాల్గొన్నారు.












