తెలంగాణ గ్రామీణ బ్యాంక్ () తమ వినియోగదారుల ఆర్థిక అవసరాలకు పరిష్కారంగా వివిధ రకాల రుణ సేవలను అందిస్తోంది. గృహ రుణాలు, విద్యా రుణాలు, వ్యాపార/ఎంఎస్ఎంఈ రుణాలు, మార్ట్గేజ్ రుణాలు, బ్యాంక్ గ్యారంటీ, వాహన/కార్/ఎక్విప్మెంట్ రుణాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి సేవలను బ్యాంక్ అందిస్తున్నట్లు తెలిపింది.
మీ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో హోమ్ లోన్స్ మరియు టేకోవర్ లోన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇతర బ్యాంకులు లేదా ప్రైవేట్ ఫైనాన్స్లలో అధిక వడ్డీ భారం ఉన్నవారికి అండగా ఉంటుందని బ్యాంక్ పేర్కొంది.
విద్యా రుణాలు
దేశంలో లేదా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం 1 కోటి వరకు ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం కల్పించింది. దీంతో పాటు బ్యాంక్ గ్యారంటీ సదుపాయం కూడా అందుబాటులో ఉందని, పిల్లల భవిష్యత్తు కోసం తోడుగా ఉంటుందని తెలిపింది.
వ్యాపార/ఎంఎస్ఎంఈ రుణాలు
కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వారికి బిజినెస్ ఎంఎస్ఎంఈ లోన్స్ మరియు మార్ట్గేజ్ లోన్స్ ద్వారా అండగా నిలుస్తుంది.
వాహన, వాణిజ్య, పరికరాల రుణాలు
వ్యాపారానికి అవసరమైన వాహనాలు లేదా పరికరాలు కొనుగోలు చేయడానికి, అలాగే పండుగ సీజన్లో కుటుంబం కోసం కారు కొనడానికి సహాయం చేస్తుంది. టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, జేసీబీ వంటి సంస్థలతో భాగస్వామ్యం ద్వారా ఆకర్షణీయ వడ్డీ రేట్లు, వేగవంతమైన రుణ మంజూరు ప్రక్రియను అందిస్తోంది.
వినియోగదారుల కష్టార్జితాన్ని సురక్షితంగా పెట్టుబడి పెట్టడానికి ఫిక్స్డ్ డిపాజిట్లను అందిస్తోంది. 1000 రోజులకు 8.00 వరకు, 444 రోజులకు 7.90 వరకు వడ్డీ రేట్లు అందిస్తున్నట్లు తెలిపింది. సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక వడ్డీ రేట్లు వర్తిస్తాయి. మీ పొదుపుకు, భవిష్యత్తుకు నమ్మకమైన తోడుగా ఉంటుందని పేర్కొంది.
మరిన్ని వివరాల కోసం సమీప తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాఖను సంప్రదించాలని సూచించింది. వడ్డీ రేట్లు, రుణ పరిమితులు, అర్హతలు మరియు ఇతర నిబంధనలు బ్యాంకు ప్రస్తుత నిబంధనలకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది.












