జిల్లేడు మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాయల్ మెన్స్ వేర్ దుస్తుల షోరూమ్‌ను మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూమ్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన, వ్యాపార రంగంలో అభివృద్ధి సాధిస్తూ మంచి పేరు సంపాదించుకోవాలని ఆకాంక్షించారు.
గ్రామీణ ప్రాంతాల్లోనే ఆధునిక దుస్తుల వ్యాపారాలు అందుబాటులోకి రావడం వల్ల స్థానిక ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని అంజయ్య యాదవ్ అన్నారు.
యువత ఉపాధి అవకాశాలను సృష్టించుకుంటూ వ్యాపార రంగంలో ముందుకు రావాలని ఆయన సూచించారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు హఫీజ్, మాజీ జడ్పీటీసీ బంగారు స్వరూప రాములు, మాజీ పీఎసీఎస్ వైస్ చైర్మన్ పడకంటి వెంకటేష్, సర్పంచులు మోహన చారి, విజయలక్ష్మి దామోదర్ రెడ్డి, వెంకటయ్య, జంగయ్య, దేవి రాంచరణ్, సోని శేఖర్, మాజీ సర్పంచులు గౌస్, మల్లేష్, మాజీ ఎంపీటీసీలు సత్య ప్రమోద్, రాములు, మాణయ్య మల్లేష్, నాయకులు జబ్బార్, కొండి యాదయ్య, మల్లేష్, నర్సింలు, అరవింద్ రెడ్డి, శేఖర్, గణేష్, రాంరెడ్డి, వెంకటయ్య, జహంగీర్, అంజయ్య, రఘు, భాస్కర్, శివరాజ్, నరేష్, సత్యం, చందు, మల్లేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.












