సారంగాపూర్, 11 September
మండలంలోని చించోలి బి, గోపాల్పేట్ గ్రామాలలో కూరగాయలు సాగుచేస్తున్న రైతుల తోటలను జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి బి. వి. రమణ బుధవారం పరిశీలించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు ఆయన అవగాహన కల్పించారు.
మండలంలోని చించోలి బి గోపాల్పేట్ గ్రామాలలో జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి బి. వి రమణ కూరగాయల సాగుచేస్తున్న రైతుల తోటలను పరిశీలించారు, రైతులకు ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయాన్ని వివరించారు, ఉద్యాన శాఖ నుండి పలు సబ్సిడీలను రైతులు ఉపయోగించుకోవాలన్నారు. వీరి వెంట ఉద్యాన అధికారి సాదుల మౌనిక, ఉద్యాన విస్తరణ అధికారి సౌమ్య మరియు రైతులు ఉన్నారు.












