మండలంలోని మహాగాం గ్రామంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా మహాసభల కరపత్రాలను విడుదల చేశారు. ఈ మహాసభను జయప్రదం చేయాలని నాయకులు రైతులకు పిలుపునిచ్చారు.
మండలంలోని మహాగాం గ్రామంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా మహాసభల కరపత్రాలను తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఇప్ప లక్ష్మణ్, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు చిట్టెల్కర్ శంకర్, మహాగాం రైతులు రాజేశ్వర్, విట్టల్ విడుదల చేశారు.
రైతు సంఘం పోరాటాలు
ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఇప్ప లక్ష్మణ్ మాట్లాడుతూ, తెలంగాణ రైతు సంఘం నిర్మల్ జిల్లాలో రైతుల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించిందని తెలిపారు. నకిలీ విత్తనాలను అరికట్టాలని, యూరియా అదనపు రేట్లకు వ్యతిరేకంగా పోరాడిందని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని పోరాటాలు నడిపిందని తెలిపారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని పోరాటాలు నిర్వహించిందని తెలిపారు.
రైతు సంఘం జిల్లా మహాసభను రేపు 30వ తేదీన ఖానాపూర్ లోని పిఆర్టియు భవనంలో నిర్వహిస్తున్నామని, నాయకులు, ప్రతినిధులు హాజరై జయప్రదం చేయాలని కోరారు.












