సారంగాపూర్ మండలంలోని మలక్ చించోలి గ్రామంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతులకు కూరగాయల విత్తనాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉద్యాన పంటల సాగు విధానాలపై అధికారులు రైతులకు అవగాహన కల్పించారు.
కూరగాయలు, పండ్లు, పూలు, సుగంధ ద్రవ్యాలు తదితర ఉద్యాన పంటల సాగుపై అధికారులు రైతులకు వివరించారు. నాణ్యమైన విత్తనాల ఎంపిక, విత్తన శుద్ధి, మొక్కల పెంపకం, ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యం, చీడపీడల నివారణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
రైతులు ఆధునిక సాగు పద్ధతులను అవలంబించి, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించాలని అధికారులు సూచించారు. ఉద్యాన పంటల సాగు ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశాలపై కూడా రైతులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దాసరి విజయ, నాయకులు లక్ష్మణ్, నామాల రమేష్, ఉద్యాన శాఖ హెచ్ఈవో సౌమ్య, కారోబార్ మైస భోజన్న, రైతులు పాల్గొన్నారు.












