జిల్లా మోర్తాడ్‌లో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగం, రాంగ్ రూట్ డ్రైవింగ్‌తో కారును ఢీకొన్న ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న యువకుడు దంతే జైపాల్ (23) మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, శుక్రవారం ( ) రాత్రి సుమారు 10.20 గంటల సమయంలో పర్స రాహుల్, దంతే జైపాల్ (23) / మురళి ఇద్దరూ ద్విచక్రవాహనంపై మోర్తాడ్‌లోని అంబేడ్కర్ విగ్రహం నుంచి వీక్లీ మార్కెట్ వైపు వెళ్తున్నారు. ప్రభుత్వ పాఠశాల సమీపంలో బైక్ నడుపుతున్న పర్స రాహుల్ అతివేగంగా, అజాగ్రత్తగా రాంగ్ రూట్లో వెళ్లి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న దంతే జైపాల్ ఎగిరిపడి తీవ్ర రక్తగాయాలకు గురయ్యాడు. వెంటనే అతడిని ఆర్మూర్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి దంతే మురళి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోర్తాడ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన బైక్ డ్రైవర్ పర్స రాహుల్‌పై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మోర్తాడ్ ఎస్సై బి. రాము మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ద్విచక్రవాహనాలు నడిపేవారితో పాటు వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలని, అతివేగం, అజాగ్రత్త డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని ఆయన కోరారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.












