తిరుమలాయపాలెం మండల ఎస్సై కూచిపూడి జగదీష్, ఆయన డ్రైవర్ కొత్తపల్లి రాకేష్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వినాయక నిమజ్జన విధుల్లో పాల్గొని తిరిగి వస్తుండగా, అర్ధరాత్రి సమయంలో వీరి వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో పోలీస్ వాహనం కూడా ధ్వంసమైంది.

వివరాల్లోకి వెళితే, వినాయక నిమజ్జన వేడుకల మండలంలోని పలు గ్రామాల్లో విధులు నిర్వహించిన అనంతరం ఎస్సై జగదీష్, డ్రైవర్ రాకేష్ పోలీస్ వాహనంలో తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్‌కు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో అర్ధరాత్రి సుమారు 1 గంట సమయంలో భవాని హోటల్ సమీపంలో వీరి వాహనాన్ని ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో పోలీస్ వాహనం తీవ్రంగా దెబ్బతింది. ఎస్సై కూచిపూడి జగదీష్‌తో పాటు, కాకరవాయి గ్రామానికి చెందిన డ్రైవర్ కొత్తపల్లి రాకేష్‌కు కూడా తలకు బలమైన గాయాలైనట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుమలాయపాలెం ఆసుపత్రికి తరలించారు.
అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలు, లారీ వివరాలు, గాయాల తీవ్రతపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.