కామారెడ్డి, Telangana (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 14
వినాయక చవితి పండుగ సందర్భంగా రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కామారెడ్డి పోలీసులు ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు, ట్రాఫిక్ పోలీస్ బూత్‌ను వినాయక మండపంగా మార్చి, అందులో హెల్మెట్ ధరించిన వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
హెల్మెట్ ధరించిన వినాయకుడు కామారెడ్డి: వినాయక చవితి సందర్భంగా రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కామారెడ్డి పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆలోచనతో ట్రాఫిక్ పోలీస్ బూత్‌ను వినాయక మండపంగా తీర్చిదిద్దారు. అందులో హెల్మెట్ ధరించిన వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ‘హెల్మెట్ ధరించండి.. ప్రాణాలను కాపాడుకోండి’ అనే సందేశాన్ని ప్రజలకు అందిస్తూ, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రహదారి భద్రతా నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. హెల్మెట్ ధరించిన వినాయకుడి విగ్రహం వాహనదారులను ఆకట్టుకోవడంతో పాటు రహదారి భద్రతపై ఆలోచింపజేస్తోంది.












