కామారెడ్డి, 10 September
పట్టణంలో ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అవసరమైన ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆటోలకు సరైన పత్రాలు తప్పనిసరి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ట్రాఫిక్ పోలీసులు జిల్లా సెప్టెంబర్ 10 మనో రంజని తెలుగు టైమ్స్ పట్టణంలో ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సీఐ నరహరి, ట్రాఫిక్ ఎస్ఐ చంద్రశేఖర్ సూచించారు. ప్రతి ఆటో డ్రైవర్ యూనిఫాం ధరించడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఫిట్నెస్, బీమా తదితర ధ్రువపత్రాలను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు శ్రీకాంత్, దేవీసింగ్, నరేష్ తదితరులు పట్టణంలో వాహనాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ ఎస్ఐ చంద్రశేఖర్ సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు.












