ఆర్మూర్, 7 September
అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి ముందు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలను ముందస్తుగా అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ సయ్యద్ అవేజ్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రవ్యాప్తంగా అరెస్టు చేసిన కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ముందస్తు అరెస్టులను ఖండించిన ఆమ్ ఆద్మీ పార్టీ హోంశాఖకు పూర్తిస్థాయి మంత్రి నియమించాలి: సయ్యద్ అవేజ్ ఆర్మూర్: అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలను ముందస్తుగా అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ సయ్యద్ అవేజ్ తీవ్రంగా ఖండించారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ అరెస్టులు జరిగాయని తెలిపారు. ఆడపిల్లలకు రక్షణ కల్పించడంతో పాటు శిరీషకు న్యాయం చేయాలని, హోంశాఖకు పూర్తిస్థాయి మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ముందస్తు అరెస్టులు చేయడం సరికాదన్నారు. అక్రమ అరెస్టులతో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు భయపడే ప్రసక్తే లేదని సయ్యద్ అవేజ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వద్ద ఉన్న శాఖలకు తక్షణమే మంత్రులను నియమించి పరిపాలనను సమర్థవంతంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అరెస్టు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని కోరారు. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. హోంశాఖకు పూర్తిస్థాయి మంత్రిని నియమించే వరకు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే వరకు తమ పార్టీ పోరాటం కొనసాగుతుందని సయ్యద్ అవేజ్ తెలిపారు.


