సంఘం (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 09
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోరుతూ తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ - రంగారెడ్డి జిల్లా సర్పంచుల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షుడు ఎల్. శివశంకర్ రెడ్డి నేతృత్వంలో 17 మండలాల సర్పంచులు ఈ వినతిపత్రాన్ని సమర్పించారు.
*సర్పంచుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *సర్పంచుల జిల్లా అధ్యక్షుడు ఎల్ శివ శంకర్ రెడ్డి* *రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పణ* రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీల్లో నెలకొన్న వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ - రంగారెడ్డి జిల్లా సర్పంచుల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా సర్పంచుల అధ్యక్షుడు ఎల్. శివశంకర్ రెడ్డి నాయకత్వంలో 17 మండలాలకు సంబంధించిన సర్పంచులు అందరూ కలిసి ఈ వినతిపత్రాన్ని అందజేశారు. ఫరూక్ నగర్ మండల అధ్యక్షుడు ఆర్. శ్రీనివాస్, రవీందర్ రెడ్డిలతో పాటు అనేక గ్రామాల సర్పంచులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఎల్. శివశంకర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీల స్వయం ప్రతిపత్తిని కాపాడేందుకు మరియు స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. *రంగారెడ్డి జిల్లా సర్పంచుల ప్రధాన డిమాండ్లు* * పంచాయతీ రాజ్ చట్టం 2018 సవరణ: ఉమ్మడి రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 2004కు విరుద్ధంగా, పంచాయతీరాజ్ సంస్థల మనుగడను ప్రశ్నార్థకం చేస్తూ అధికారుల పెత్తనానికి ప్రాధాన్యతనిస్తున్న "తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం - 2018" ను రద్దు చేయాలి లేదా సవరించాలి. * 73వ రాజ్యాంగ సవరణ అమలు: 73వ రాజ్యాంగ సవరణ చట్టంలోని 243 + 11వ షెడ్యూల్లో ఉన్న 29 అధికారములు, విధులు, నిధులను యథాతథంగా పంచాయతీలకు కేటాయించాలి. * ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు: గ్రామాలు, రాజకీయ వివాదాలతో అభివృద్ధికి ఆటంకం కలుగుతున్నందున ఉప సర్పంచుల చెక్ పవర్‌ను రద్దు చేయాలి. * విద్యుత్ బిల్లుల చెల్లింపు: ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసిన విధంగానే పంచాయతీ విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే నేరుగా చెల్లించాలి. * స్థానిక పన్నుల జమ: గ్రామ పంచాయతీ స్థానిక పన్నులను, స్టాంప్ డ్యూటీలను, సీనరేజ్, మైనింగ్ మరియు పన్నులను నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాలో జమ చేయాలి. * రెవెన్యూ సరిహద్దుల నిర్ణయం: నూతనంగా ఏర్పాటైన గ్రామ పంచాయతీల పరిధిని రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా నిర్ణయించాలి. * తండా పంచాయతీలకు భవనాలు: తండా గ్రామ పంచాయతీలకు GP భవనములు మరియు రోడ్లను మంజూరు చేయాలి. * ముఖ్యమంత్రి హామీ నిధుల విడుదల: గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన విధంగా మైనర్ గ్రామ పంచాయతీలకు ₹5 లక్షలు, మేజర్ గ్రామ పంచాయతీలకు ₹10 లక్షలు వెంటనే విడుదల చేయాలి. * జనరల్ ఫండ్ బకాయిలు: గత 2 సంవత్సరాల నుండి నిలిచిపోయిన జనరల్ ఫండ్ బకాయిలు దాదాపు ₹500 కోట్లను వెంటనే విడుదల చేయాలి. * 15వ ఆర్థిక నిధులు: 15వ ఆర్థిక కింద కేంద్రం నుండి తెలంగాణకు రావలసిన ₹1090 కోట్ల బకాయిలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలి. * మ్యాచింగ్ గ్రాంట్లు: తెలంగాణ ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్లు ₹2,979 కోట్ల పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి. * MLC ఎన్నికల్లో ఓటు హక్కు: MLC ఎన్నికలలో సర్పంచులకు ఓటు హక్కు కల్పించాలి. * గౌరవ వేతనం పెంపు: SC/ST/BC/మైనార్టీ సర్పంచుల కోసం సర్పంచుల గౌరవ వేతనాన్ని ₹6,500/- ల నుండి ₹25,000/- లకు పెంచాలి. * ఇందిరమ్మ కమిటీల జీవో రద్దు: "ఇందిరమ్మ కమిటీల" పేరుతో గ్రామ సభ మరియు సర్పంచుల అధికారాలను నీరుగారుస్తున్న జీవోను వెంటనే రద్దు చేయాలి. * MGNREGS నిధులు: ఉపాధి హామీ (MGNREGS) కింద కేంద్ర ప్రభుత్వం కేటాయించే బడ్జెట్‌ను నేరుగా గ్రామ పంచాయతీ అకౌంట్లో జమచేయాలి.. KP











