హైదరాబాద్, 9 September
కాళోజీ నారాయణరావు ప్రజల గొంతుకగా, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కాళోజీ జయంతిని పురస్కరించుకుని బుధవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించిన ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైనిక కవిగా, ఖండాంతర కవిగా గుర్తింపు పొందిన వేలూరి రాములు (వి.ఆర్. విద్యార్థి)కి 2026 కాళోజీ నారాయణరావు సాహిత్య పురస్కారాన్ని మంత్రి ప్రదానం చేశారు.
కాళోజీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి వి.ఆర్. విద్యార్థి వంటి కవులు, రచయితలు స్ఫూర్తిగా నిలవాలి: మంత్రి జూపల్లి ( కాళోజీ నారాయణరావు ప్రజల గొంతుకగా, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కాళోజీ జయంతిని పురస్కరించుకుని బుధవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించిన ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా సైనిక కవిగా, ఖండాంతర కవిగా గుర్తింపు పొందిన వేలూరి రాములు(వి.ఆర్. విద్యార్థి)కి 2026 కాళోజీ నారాయణరావు సాహిత్య పురస్కారాన్ని మంత్రి ప్రదానం చేశారు. పురస్కారం అందుకున్న విద్యార్థిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.కాళోజీ సాహిత్య వారసత్వాన్ని వి.ఆర్. విద్యార్థి వంటి కవులు, రచయితలు పుణికిపుచ్చుకుని ముందుకు తీసుకెళ్లాలని జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ ప్రజల జీవితం, బాధ, ఆశలు, ఆకాంక్షలు, పోరాటం, ఆత్మగౌరవం కాళోజీ రచనల్లో ప్రతిబింబించాయని పేర్కొన్నారు.కాళోజీ రచించిన ‘నా గొడవ’ ఆయన వ్యక్తిగత సమస్యలకు సంబంధించినది కాదని, అణగారిన, బాధిత, సామాన్య ప్రజల సమస్యలను తనవిగా స్వీకరించిన గొప్ప ప్రజాకవి కాళోజీ అని కొనియాడారు. ప్రజల సమస్యలను తన కలం ద్వారా సమాజానికి వినిపించిన ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. తెలంగాణ యాస.. కాళోజీ శ్వాస తెలంగాణ భాష, యాసపై కాళోజీకి ఉన్న ప్రగాఢ విశ్వాసం ఆయన రచనల్లో స్పష్టంగా కనిపిస్తుందని మంత్రి తెలిపారు. ప్రజలు మాట్లాడే భాషలోనే రచనలు చేయాలని కాళోజీ విశ్వసించారని చెప్పారు. తెలంగాణ యాసను, భాషను తక్కువగా చూసే ధోరణులకు తన రచనల ద్వారా కాళోజీ సమాధానం చెప్పారని పేర్కొన్నారు. పుస్తకాలలో కనిపించే భాష కంటే ప్రజల నిత్య జీవితంలో సహజంగా వినిపించే పలుకుబడుల భాషలోనే జీవన వాస్తవికత ఉంటుందని కాళోజీ భావించారని జూపల్లి అన్నారు. అందుకే ఆయన రచనలు సామాన్య ప్రజలకు మరింత చేరువయ్యాయని తెలిపారు. భాష కేవలం భావాలను వ్యక్తం చేసే సాధనం మాత్రమే కాదని, ఒక జాతి చరిత్ర, సంస్కృతి, జీవన విధానం, ఆత్మగౌరవానికి ప్రతిబింబమని మంత్రి పేర్కొన్నారు. కాళోజీ అందించిన స్ఫూర్తిని కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఆయన జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల గద్దర్, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, నిథమ్ డైరెక్టర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.











