తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించేందుకు, పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో హైదరాబాద్‌లో 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ ఆహ్వానానికి ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించారు.
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామిక అభివృద్ధికి మరింత ఊతమివ్వడం లక్ష్యంగా హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో, 8, 9 తేదీల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఆహ్వానించారు.
తుమ్మిడిహెట్టి బ్యారేజీకి సంబంధించి జరిగిన సమావేశం అనంతరం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ, దాని ప్రాధాన్యత గురించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కు వివరించారు. ఈ సందర్భంగా సమ్మిట్‌కు హాజరుకావాలని ఆయనను ఆహ్వానించారు.
తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేసేందుకు ఈ గ్లోబల్ సమ్మిట్ కీలక వేదికగా నిలవనుంది.
ఈ నేపథ్యంలో, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల భాగస్వామ్యంతో సదస్సును విజయవంతంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది.
రేవంత్ రెడ్డి ఆహ్వానంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించారు. సదస్సులో పాల్గొనేందుకు తనకు ఆసక్తి ఉందని, హాజరయ్యేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.











