ప్రభుత్వం పిఆర్సి కమిషన్ గడువు పెంపు దిశగా యోచిస్తుందన్న వార్త నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పిఆర్సి నివేదికను అమలు చేసి, మూడు డిఏలను విడుదల చేయాలని పిఆర్టియు జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు.
ప్రభుత్వం తక్షణ ఫిట్మెంట్తో పిఆర్సి అమలు చేసి మూడు డిఏలను వెంటనే విడుదల చేయాలని పిఆర్టియు జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు. పిఆర్సి కమిషన్ గడువు పెంపు దిశగా ప్రభుత్వం యోచిస్తుందన్న వార్త విని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పిఆర్సి మంజూరు గడువు 39 నెలలు ఆలస్యం అయిందని, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సహనాన్ని ఇంకా పరీక్షించవద్దని, వెంటనే పిఆర్సి నివేదికను తెప్పించుకొని అమలు చేయాలని కోరారు.
ఐదు డిఏలు చెల్లించాల్సిన చోట కేవలం రెండు డిఏలు (ఒకటి 33 వాయిదాలు, రెండవది 27 వాయిదాలతో) మాత్రమే మంజూరు చేసి, ఉద్యోగులు, పెన్షనర్లను సంతోషపరిచినట్లు ప్రభుత్వం స్వీయ సంతృప్తి చెందుతోందని, అది కేవలం వారి భ్రమ మాత్రమేనని, మంజూరు చేసిన రెండు డిఏలతో ఉద్యోగులు, పెన్షనర్లు ఎవరూ సంతోషంగా లేరని తెలిపారు. వాస్తవానికి ఉద్యోగులు, పెన్షనర్లు అందరూ కూడా పిఆర్సి కొరకు ఎదురుచూస్తున్నారని అన్నారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ ఎన్నికలు, ఖైరతాబాద్ శాసనసభ మధ్యంతర ఎన్నికలు, మార్చిలో జరిగే రెండు గ్రాడ్యుయేట్ స్థానాలకు ఎన్నికలు నేపథ్యంలో, ఎన్నికల కోడ్ రాకముందే ప్రభుత్వం తక్షణమే పిఆర్సి నివేదికను అమలు చేయాలని, మూడు డిఏలను విడుదల చేయాలని పిఆర్టియు పక్షాన జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు.












