హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ కీలకమైన కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది.
అధికారులకు ఆదేశాలు
ఈ సమావేశానికి అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు తగిన సమాచారంతో అందుబాటులో ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై అధికారులు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని సూచించారు.
దసరా నుంచి రెండు డీఏలను అమలు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో, ఈ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఇది ఊరట కలిగించే అంశంగా పరిగణించబడుతోంది.










