రవాణా అనేది ఉత్పత్తి ప్రక్రియకు కొనసాగింపు అని కార్ల్ మార్క్స్ చెప్పినట్లు, వస్తువు ఉత్పత్తి నుంచి వినియోగదారుడి చేతికి చేరే వరకు రవాణా కీలక పాత్ర పోషిస్తుంది. ముడిసరుకును ఉత్పత్తి కేంద్రానికి చేర్చడం, తయారైన వస్తువును వినియోగదారుడి వద్దకు చేర్చడం ద్వారా రవాణా వస్తువుకు విలువను జోడిస్తుంది. అందుకే పెట్టుబడి చక్రంలో రవాణా ఒక అవసరమైన ఉత్పాదక శ్రమగా నిలుస్తుంది. అయితే, రవాణా వ్యవస్థ ఎంతగా అభివృద్ధి చెందినా, దానిని నడిపించే కార్మికుడి శ్రమదోపిడీ మాత్రం కొత్త రూపాల్లో కొనసాగుతోంది. భారతదేశం సుమారు 67 లక్షల కిలోమీటర్ల రోడ్లతో ప్రపంచంలోనే అతిపెద్ద రోడ్డు రవాణా నెట్‌వర్క్‌గా నిలిచింది. ప్రాచీన కాలంలో చక్రం ఆవిష్కరణ, పారిశ్రామిక విప్లవంలో మోటార్ ఆవిష్కరణ రవాణా చరిత్రలో కీలక మలుపులు. రోడ్డు నిర్మాణంలో మెక్డామ్ విధానం, బిట్‌మెన్ రోడ్లు, ఆస్ఫాల్ట్ పేవింగ్, ఆధునిక సిమెంట్-కాంక్రీట్ రోడ్లు వంటి సాంకేతిక పద్ధతులు అభివృద్ధి చెందాయి. స్వాతంత్ర్యం తర్వాత పంచవర్ష ప్రణాళికల్లో రహదారులకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఆర్టీసీల ఏర్పాటు, రవాణా చట్టాలు, వివిధ రహదారి సంస్థల ఏర్పాటు జరిగింది. బొంబాయి, లక్నో రోడ్డు ప్లాన్లు వంటి దీర్ఘకాలిక ప్రణాళికలు అమలయ్యాయి. ఇప్పుడు , , , , వంటి సాంకేతిక పరిజ్ఞానాలు రవాణా నిర్వహణలో కీలకంగా మారాయి. ఎం.ఆర్. జయకర్, రాకేష్ మోహన్, సుందర్ కమిటీల సిఫారసులు కూడా రవాణా విధానాల రూపకల్పనపై ప్రభావం చూపాయి. ఇంతటి అభివృద్ధి సాధించిన రవాణా రంగంలో పనిచేస్తున్న కార్మికుడి పరిస్థితి మాత్రం ఎలా ఉంది

ఎల్పీజీ విధానాల తర్వాత మారిన రవాణా రంగం
1990ల తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (ఎల్పీజీ) విధానాల ప్రభావంతో రవాణా రంగంలోనూ మార్పులు వచ్చాయి. నిరుద్యోగం పెరగడంతో చదువుకున్న యువత ఆటో, క్యాబ్, గూడ్స్ రవాణా రంగాల్లో డ్రైవర్లుగా పెద్ద సంఖ్యలో చేరారు. దీంతో రోడ్డు రవాణాలో అసంఘటిత కార్మికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. మోటార్ వెహికల్ యాక్ట్2019లోని సెక్షన్ 93 తర్వాత అగ్రిగేటర్ వ్యవస్థ విస్తరించింది. జాతీయ స్థాయిలో 5, రాష్ట్రాల స్థాయిలో 2530 వరకు అగ్రిగేటర్లు ఏర్పడ్డారు. వీటి పరిధిలో ప్రస్తుతం సుమారు 5060 లక్షల మంది డ్రైవర్లు రిజిస్టర్ అయి ఉన్నారు. భవిష్యత్తులో డ్రైవర్లలో 95 శాతం వరకు ఏదో ఒక యాప్‌కు అనుసంధానమయ్యే పరిస్థితి రావచ్చు. సాంకేతికత పెరిగినా, ఈ వ్యవస్థలో డ్రైవర్లపై శ్రమ దోపిడీ మరింత తీవ్రమవుతోంది.