మండలంలోని హతగాం రహదారి అధ్వానంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై ఏర్పడిన గుంతల కారణంగా ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు రాకపోకలు కష్టంగా మారాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గుంతలతో నిండిన రహదారిపై ప్రయాణం నరకయాతనగా మారిందని వాహనదారులు ఆరోపిస్తున్నారు. వర్షాలు కురిసిన సమయంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోందని తెలిపారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి హతగాం రహదారికి మరమ్మతులు చేపట్టి, రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.