నిర్మల్ పట్టణంలో ఈ నెల 25న జరగనున్న గణేష్ నిమజ్జన కార్యక్రమానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని బాసర జోన్2 డీఐజీ ఆర్. భాస్కరన్ పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన నిర్మల్ జిల్లాను సందర్శించారు. జిల్లా పోలీసు అతిథి గృహానికి చేరుకున్న జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల పూలమొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిమజ్జన శోభాయాత్ర సాగే మార్గాలు, బందోబస్తు, రాకపోకల నియంత్రణ, నిఘా కెమెరాల పర్యవేక్షణ, ప్రజల భద్రత తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం బాసరలో గణేష్ నిమజ్జనం జరిగే ప్రాంతాలను డీఐజీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో భైంసా అదనపు పోలీసు అధికారి సాయి కిరణ్, బాసర పోలీసు వృత్తాధికారి దీపక్, ఉప పరిశీలకుడు శ్రీకాంత్ తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
గణేష్ నిమజ్జనానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు
Share:

సారాంశం
నిర్మల్ పట్టణంలో ఈ నెల 25న జరగనున్న గణేష్ నిమజ్జన కార్యక్రమానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని బాసర జోన్2 డీఐజీ ఆర్. భాస్కరన్ పోలీసు అధికారులను ఆదేశించారు.
ముఖ్య విషయాలు
- నిర్మల్ పట్టణంలో ఈ నెల 25న జరగనున్న గణేష్ నిమజ్జన కార్యక్రమానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని బాసర జోన్2 డీఐజీ ఆర్.
- భాస్కరన్ పోలీసు అధికారులను ఆదేశించారు.
- బుధవారం ఆయన నిర్మల్ జిల్లాను సందర్శించారు.
- జిల్లా పోలీసు అతిథి గృహానికి చేరుకున్న జిల్లా ఎస్పీ డా.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3888ఆర్టికల్స్
4,72,765వ్యూస్










