తానూర్, 8 November
నిర్మల్ జిల్లా మండలంలోని బోల్సా గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
నిర్మల్ జిల్లా మండలంలోని బోల్సా గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సి.హెచ్. సుదర్శన్ యాదవ్, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపాలు వెలిగించి, వారికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాల్లో పండుగ వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.
ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల నెరవేరాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ లక్ష్మణ్‌తో పాటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.












