దిలావర్పూర్, 8 November
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం న్యూలోలం గ్రామంలో ఆదివారం మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్ పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిర్మించుకున్న లబ్ధిదారుడి నూతన గృహంలో ఆయన దీపాలు వెలిగించి, కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకున్నారు.
ఇల్లు లేని నిరుపేదలందరికీ సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని ఇన్చార్జి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్ తెలిపారు. దిలావర్పూర్ మండలం న్యూలోలం గ్రామంలో ఆదివారం నిర్వహించిన మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిర్మించుకున్న లబ్ధిదారుడి నూతన గృహంలో దీపాలు వెలిగించి, కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, పేద కుటుంబాలు తమ సొంతింటిలో దీపావళి పండుగను జరుపుకోవడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే అనేక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, నిర్మల్ జిల్లాలోనూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు నిర్మించి అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.
అనంతరం లబ్ధిదారు మాట్లాడుతూ, తమ నూతన గృహంలో నిర్వహించిన దీపావళి వేడుకల్లో పాల్గొని ఆనందాన్ని పంచుకున్న అదనపు కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు.












