మండలం తకెళ్లపాడు తండా గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారు భూక్యా సుజాత నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఆదివారం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన గృహానికి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి, లబ్ధిదారు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు నిర్వహిస్తున్న మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారు కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుండు నరేందర్ గౌడ్, మండల స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ వెంకటరెడ్డి, ఎంపీడీవో శేషగిరి శర్మ, కేజేఆర్ కాలనీ సర్పంచ్ సిద్దు నాయక్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, అధికారులు, లబ్ధిదారు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


