మండలం కంజర్ గ్రామస్తుల భూముల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శనివారం తహసీల్దార్ కార్యాలయంలో భూ సమస్యల పరిష్కారంపై ఆయన సమావేశం నిర్వహించారు.
సమావేశంలో, కలెక్టర్ భవేశ్ మిశ్రా భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తుల సంఖ్య, వాటి పరిష్కారానికి చేపట్టిన చర్యల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరించాలని ఆయన సూచించారు. ప్రతి దరఖాస్తుకు సంబంధించిన వివరాలను క్లుప్తంగా నమోదు చేయాలని, అన్ని దరఖాస్తుల వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని ఆయన తెలిపారు. మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణికి వచ్చే దరఖాస్తులన్నీ ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు. ఆయా శాఖల అధికారులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని, అవసరమైతే పై స్థాయికి పంపాలని సూచించారు.
మండలంలో జరుగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను కూడా కలెక్టర్ సమీక్షించారు. భూముల రీ సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకట మాధవ రావు, ఆర్డీవో దేవీదాస్, తహసీల్దార్ సరిత, ఎంపిడివో వనజ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












