ఉపాధి హామీ పథకం కింద ఇంకుడు గుంతల నిర్మాణం, ఫారం ఫండ్ పనులు త్వరగా పూర్తి చేయాలని మండల పరిషత్ అధికారి (ఎంపీడీఓ) భూమారావు అన్నారు. కుబీర్ మండలంలోని పార్డి (బి) గ్రామంలో శుక్రవారం గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మహిళా సంఘాల సభ్యులకు ఈ సూచనలు చేశారు.
పథకాలపై అవగాహన
ఈ సందర్భంగా ఆయన ఎస్ఈఆర్పీ () అన్ని రకాల సంక్షేమ పథకాల గురించి సభ్యులకు తెలియజేశారు. ఈ సమావేశంలో స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్ మడి ప్రవీణ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి సాయినాథ్, ఉపాధి హామీ టీసీసీ పరశురాం, వీఓఏ రమేష్, వీఓ అధ్యక్షురాలు గుమ్ముల గజ్జవ్వ, వీఓ సభ్యులు పాల్గొన్నారు.












