నిర్మల్ జిల్లా మండల తహసీల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీ రమేష్ రాథోడ్ సందర్శించారు. కార్యాలయంలో జరుగుతున్న పనులను ఆయన సమీక్షించి, పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
సారంగాపూర్ సారంగాపూర్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని నిర్మల్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీ రమేష్ రాథోడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో జరుగుతున్న పనులను ఆయన సమీక్షించారు.
సీఐఆర్ () ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని, భూభారతి, ప్రజావాణి ఫైళ్లను పెండింగ్లో లేకుండా, మీసేవ సర్టిఫికెట్లను ఎప్పటికప్పుడు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్ కాంత్ రావు, ఎంపీడీవో లక్ష్మీకాంత్, నాయబ్ తహసీల్దార్ రాంచందర్, సిబ్బంది పాల్గొన్నారు.












