పెండింగ్లో ఉన్న భూభారతి దరఖాస్తులను వెంటనే , గ్రామాల్లో కొనసాగుతున్న రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో భూభారతి దరఖాస్తుల పరిష్కారం, రీ సర్వే ప్రక్రియపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మండలాల వారీగా పెండింగ్లో ఉన్న భూభారతి దరఖాస్తుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను ప్రాధాన్య క్రమంలో సూచించారు. అవసరమైన దరఖాస్తులను తమ స్థాయి నుంచి పైస్థాయికి పంపాలని ఆదేశించారు.
ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం పారదర్శకంగా స్పష్టం చేశారు. అవసరమైతే క్షేత్రస్థాయిలో అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా సర్వేలు నిర్వహించి సమస్యలను సూచించారు.
రీ సర్వేపై ప్రత్యేక దృష్టి
గ్రామాల్లో కొనసాగుతున్న రీ సర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, తహసీల్దార్లు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో రీ సర్వే పనులను పరిశీలించాలని సూచించారు. తమ పరిధిలో జరుగుతున్న రీ సర్వే ప్రక్రియపై రోజువారీగా సమీక్ష నిర్వహించాలని స్పష్టం చేశారు.
ఈ సమీక్ష సమావేశంలో ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్, డీఎఫ్ఓ సుశాంత్ సుఖదేవ్ బోబడే, బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీవో దేవీదాస్, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.











