బైంసా గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు ప్రథమ చికిత్సలు అందిస్తున్న ఆర్.ఎం.పి, పి.ఎం.పిల గుర్తింపునకు ప్రభుత్వం తక్షణమే చొరవ చూపాలని ఆర్ఎంపి అసోసియేషన్ జిల్లా బాధ్యులు ఆశమొల్ల మోహన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు.
బైంసా గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు ప్రథమ చికిత్సలు నిర్వహిస్తున్న ఆర్.ఎం.పి, పి.ఎం.పిల గుర్తింపుకై ప్రభుత్వం తక్షణమే చొరవ చూపాలని ఆర్ఎంపి అసోసియేషన్ జిల్లా బాధ్యులు ఆశమొల్ల మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని రేవంత్ సర్కార్ తమ మేనిఫెస్టోలో ఆర్ఎంపీలకు శిక్షణ ఇచ్చి గుర్తింపునిస్తానని ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. శిక్షణను వాటి ఉంచి ఆర్ఎంపీల ప్రథమ చికిత్స కేంద్రాలపై అధికారులు దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. గ్రామీణ పేద ప్రజల పక్షాన నిలుస్తున్న ఆర్ఎంపీలను అనగదొక్కే ప్రయత్నాన్ని విరమించుకోవాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకుంటున్న ఆర్.ఎం.పి, పి.ఎం.పిలకు తక్షణమే గుర్తింపునిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేనిచో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.












