విశాఖపట్నంలో జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ముఖ్యంగా 39వ వార్డు కూటమి అభ్యర్థి దామోదర్ యాదవ్, టీడీపీ నేత సీతంరాజు సుధాకర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. తాను బీజేపీలో 15 ఏళ్లుగా పనిచేస్తున్నానని, పార్టీతో చర్చించి టికెట్ తెచ్చుకున్నప్పటికీ పోటీ నుంచి తప్పుకోవాలని ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.
విశాఖపట్నంలో జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ముఖ్యంగా 39వ వార్డు కూటమి అభ్యర్థి దామోదర్ యాదవ్, టీడీపీ నేత సీతంరాజు సుధాకర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. తాను బీజేపీలో 15 ఏళ్లుగా పనిచేస్తున్నానని, పార్టీతో చర్చించి కార్పొరేటర్ అభ్యర్థిగా టికెట్ తెచ్చుకున్నప్పటికీ, తనను పోటీ నుంచి తప్పుకోవాలని ఒత్తిడి తెచ్చారని దామోదర్ యాదవ్ ఆరోపించారు. అంతేకాకుండా తనకు వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇచ్చి, తనను ఓడించేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. ఈ వ్యవహారంతో టీడీపీ, బీజేపీ నేతల మధ్య విభేదాలు చర్చనీయాంశంగా మారాయి. జీవీఎంసీ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థుల పోటీ, టికెట్ల కేటాయింపుపై అసంతృప్తి, కూటమి పార్టీల మధ్య సమన్వయ సమస్యలను బయటపెట్టాయి.











