తెలంగాణ, 8 September
తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పాలమూరు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, టాటా మధులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి వారిపై వేటు వేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే పోలీసులు ఈ ఇద్దరు ఎమ్మెల్సీలను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
*ఎమ్మెల్సీలు నవీన్ రెడ్డి తాతా మధులపై చర్యలకు ప్రభుత్వం సిద్ధం ..!* *ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటుకు సంసిద్ధం* *టిఆర్ఎస్ ఎమ్మెల్సీలను ఇప్పటికే కోర్టులో హాజరు పరిచిన పోలీసులు* *ఎమ్మెల్సీల తీరుపై ప్రభుత్వం ఆగ్రహం* *అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే ఇద్దరు ఎమ్మెల్సీలపై చర్యలకు సిద్ధం* తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో పాలమూరు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, అదేవిధంగా టాటా మధులపై రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకునేందుకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెడుతూ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఇరు ఎమ్మెల్సీలను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. తాజాగా ఎమ్మెల్సీల వ్యవహారంపై ప్రభుత్వం వారి వీడియోలను తెప్పించుకొని పోలీసులు మొత్తం వ్యవహారాన్ని పరిశీలించింది. ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరు పట్ల పూర్తి అగ్రహాన్ని అటు పోలీస్ శాఖ ఇటు ప్రభుత్వం తెలియజేసినట్లు సమాచారం. ఇలాంటి ఎమ్మెల్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నట్లు తెలుస్తోంది. అటు చట్టపరంగా ఇటు ఎమ్మెల్సీల వ్యవహార శైలిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి వేటు వేసే విధంగా చర్యలు ఉండవచ్చని తెలుస్తుంది..












