आంధ్రప్రదేశ్, 7 September
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సర్వసన్నద్ధమవుతోంది. ఈ దిశగా ఎన్నికల కసరత్తును వేగవంతం చేస్తూ, రాష్ట్రంలోని 28 జిల్లాలకు పార్టీ ఇన్ఛార్జ్లను నియమిస్తూ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఈసారి సరికొత్త వ్యూహాన్ని అనుసరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

జిల్లాల వారీగా ఇన్ఛార్జ్లు
పార్వతీపురం మన్యం - దాడి రత్నాకర్, అల్లూరి సీతారామరాజు - పేరాబత్తుల రాజశేఖర్, శ్రీకాకుళం - ఎండీ నజీర్, విజయనగరం - ఎంపీ చింతకాయల విజయ్, విశాఖపట్నం - ఎంఏ షరీఫ్, అనకాపల్లి - కొండపల్లి అప్పలనాయుడు, పోలవరం - కె సత్తిబాబు, కాకినాడ - సుజయ్ కృష్ణరంగారావు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ - ఎంపీ సానా సతీష్, తూర్పుగోదావరి - దేవినేని ఉమామహేశ్వరరావు, పశ్చిమగోదావరి - ఎంపీ భాష్యం రామకృష్ణ, ఏలూరు - ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, కృష్ణా - కొమ్మాలపాటి శ్రీధర్, ఎన్టీఆర్ - మక్కెన మల్లికార్జునరావు, గుంటూరు - ఎంవీ సత్యనారాయణరాజు, పల్నాడు - కొనకళ్ల నారాయణ, బాపట్ల - జంగా కృష్ణమూర్తి, ప్రకాశం - ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, మార్కాపురం - ఎమ్మెల్సీ బీటీ నాయుడు, నెల్లూరు - ఎస్వీఎస్ఎన్ వర్మ, తిరుపతి - నూకసాని బాలాజీ, చిత్తూరు - దామచర్ల సత్య, కడప - దీపక్ రెడ్డి, అన్నమయ్య - ఎమ్మెల్సీ శ్రీకాంత్, అనంతపురం - ఏరాసు ప్రతాప్‌రెడ్డి, శ్రీసత్యసాయి - సోమిశెట్టి వెంకంటేశ్వర్లు, కర్నూలు - పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి, నంద్యాల - వైకుంఠం ప్రభాకర్ చౌదరి.
అభ్యర్థుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకు కాకుండా సీనియర్లకు అప్పగించడం ఈ ఎన్నికల వ్యూహంలో కీలక మార్పు. మిత్రపక్షాలతో సమన్వయం, ప్రచారం వంటి అంశాలపై నియమితులైన ఇన్ఛార్జ్లకు కీలక బాధ్యతలు అప్పగించారు.
ఇదిలా ఉండగా, ఫలితాల్లో తేడా వస్తే సహించేది లేదని కుప్పం నేతలకు సీఎం చంద్రబాబు హెచ్చరించినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చాటేందుకు అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించింది.