ఆదిలాబాద్‌లోని జరిగిన అగ్నిప్రమాదం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు శిశువులు మృతి చెందడంతో అప్రమత్తమైన ప్రభుత్వం, మరమ్మతులు, మౌలిక వసతుల పునరుద్ధరణకు రూ.11.1 కోట్ల నిధులను విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో భద్రతా తనిఖీలను ముమ్మరం చేయాలని ఆదేశించింది.
ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో న జరిగిన అగ్నిప్రమాదం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు శిశువులు మృతి చెందిన ఘటనతో అప్రమత్తమైన ప్రభుత్వం, మరమ్మతులు, మౌలిక వసతుల పునరుద్ధరణకు రూ.11.1 కోట్ల నిధులను విడుదల చేసింది. దీంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో భద్రతా తనిఖీలను ముమ్మరం చేయాలని ఆదేశించింది.
విడుదల చేసిన నిధుల్లో మరుగుదొడ్లు, బాత్రూమ్ల మరమ్మతులకు రూ.5 కోట్లు, సీసీ పేవ్మెంట్లు, దెబ్బతిన్న ప్రహరీ గోడ మరమ్మతులకు రూ.1.6 కోట్లు కేటాయించారు. ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగం పునరుద్ధరణకు రూ.1 కోటి, ఆస్పత్రి భవనాల పెయింటింగ్‌కు రూ.1 కోటి, ఆక్సిజన్ పైప్‌లైన్ అత్యవసర మరమ్మతులకు రూ.1.5 కోట్లు, విద్యుత్ పనులకు రూ.1 కోటి కేటాయించినట్లు అధికారులు తెలిపారు.
రిమ్స్ ఘటన అనంతరం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో సమగ్ర భద్రతా ఆడిట్లు నిర్వహించాలని వైద్యారోగ్య శాఖ ఆదేశించింది. అగ్ని, విద్యుత్ భద్రతకు సంబంధించిన తనిఖీలను ప్రతి ఆరు నెలలకు ఒకసారి, నిర్మాణ భద్రతను ఏడాదికి ఒకసారి నిర్వహించాలని నిర్ణయించారు. తనిఖీల్లో గుర్తించిన లోపాలను నిర్దిష్ట గడువులోగా సరిచేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఫైర్ అలారాలు, అగ్నిమాపక పరికరాలు, హైడ్రెంట్లు, స్ప్రింక్లర్లు, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, విద్యుత్ వ్యవస్థలు, జనరేటర్లు, ఆక్సిజన్ వ్యవస్థలు, తరలింపు విధానాలు వంటి అంశాలను భద్రతా తనిఖీల్లో పరిశీలించనున్నారు. ఐసీయూలు, ఆపరేషన్ థియేటర్లు, ఎస్ఎన్సీయూలు, ఎన్ఐసీయూలు, డయాలసిస్ విభాగాలు, అత్యవసర విభాగాలను ప్రత్యేక సున్నిత ప్రాంతాలుగా గుర్తించి, ప్రత్యేక భద్రతా ప్రణాళికలు రూపొందించనున్నారు. ఆస్పత్రి సిబ్బందికి క్రమం తప్పకుండా మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు.
ఇదిలా న జిల్లా కలెక్టర్ నిర్వహించిన తనిఖీలో సిబ్బంది కొరత, విధుల కేటాయింపులో లోపాలు, హాజరు నమోదులో వ్యత్యాసాలు వంటి అంశాలు కూడా వెలుగులోకి వచ్చినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
రిమ్స్ ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరుగురు సభ్యుల కమిటీ ఇప్పటికే విచారణ ప్రారంభించింది. ప్రమాదానికి దారితీసిన సాంకేతిక లోపాలు, భద్రతా ప్రమాణాలు, ఇతర కారణాలను కమిటీ పరిశీలిస్తోంది.












