బంజారాహిల్స్, తెలంగాణ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 08
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఆయన, బీఎన్ఎస్ సెక్షన్ల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు.
రేవంత్ రెడ్డి, వీర్లపల్లి శంకర్‌పై కేసులు నమోదు చేయాలి హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బీఎన్ఎస్ సెక్షన్లు 351, 351(3), 196(1), 61 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ రేవంత్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్‌పై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్ చావు కోరుతూ, వెయ్యి డప్పుల ర్యాలీ నిర్వహిస్తామని చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, మహిళా నాయకులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదులో పాల్గొన్నారు. సంబంధిత వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు.












